వాటికన్ సిటీపై అల్ఖైదా గురి? | Al Qaida may have targeted Vatican | Sakshi
Sakshi News home page

వాటికన్ సిటీపై అల్ఖైదా గురి?

Apr 24 2015 7:57 PM | Updated on Aug 17 2018 7:36 PM

వాటికన్ సిటీపై అల్ఖైదా గురి? - Sakshi

వాటికన్ సిటీపై అల్ఖైదా గురి?

క్రైస్తవులకు పరమ పవిత్రమైన వాటికన్ సిటీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా లక్ష్యంగా చేసుకుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

క్రైస్తవులకు పరమ పవిత్రమైన వాటికన్ సిటీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా లక్ష్యంగా చేసుకుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లలో దాడులకు కుట్ర పన్నడంతో పాటు అరెస్టయిన నిందితులు వాటికన్ సిటీని కూడా లక్ష్యంగా చేసుకున్నారని కాగ్లియారీ చీఫ్ ప్రాసిక్యూటర్ మౌరో మురా తెలిపారు.

ఇటలీలో దేశవ్యాప్తంగా చేసిన సోదాల్లో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరికీ అల్ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఓ ఆధ్యాత్మిక గురువు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లు కాకుండా మరికొందరు ఇప్పటికే అక్కడి నుంచి పారిపోయినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement