అజిత్‌కు టాటా చెప్పేసింది | Ajith, sruthihasan in vedalam movie | Sakshi
Sakshi News home page

అజిత్‌కు టాటా చెప్పేసింది

Oct 9 2015 8:42 AM | Updated on Sep 3 2017 10:41 AM

అజిత్‌కు టాటా చెప్పేసింది

అజిత్‌కు టాటా చెప్పేసింది

నటుడు అజిత్‌కు అందాల భామ శ్రుతిహాసన్ బై చెప్పేశారు.

చెన్నై : నటుడు అజిత్‌కు అందాల భామ శ్రుతిహాసన్ బై చెప్పేశారు. ఏమిటీ వారిద్దరి మధ్య ఏముంది? అజిత్‌కు శ్రుతిహాసన్ టాటా చెప్పడానికి అనేగా మీ సందేహం. వారిద్దరి మధ్య చాలానే ఉంది. ఇద్దరూ కలిసి ఒక క్రేజీ చిత్రంలో నటిస్తున్నారు. అది చాలదా అజిత్‌కు శ్రుతికి మధ్య చక్కని సాన్నిహిత్యం ఉందనడానికి. వీరిద్దరి తొలి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం వేదాళమ్ దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
 
ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అజిత్ హీరోగా నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న మూడవ చిత్రం వేదాళమ్. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో శ్రుతిహసన్ అజిత్‌కు బై చెప్పేశారు. విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించి శ్రుతిహాసన్ తను నటించాల్సిన సన్నివేశాలను పూర్తి చేసేశారట. దీంతో అజిత్‌తో పాటు చిత్ర యూనిట్‌కు శ్రుతి టాటా బైబై చెప్పారట.
 
ఈ విషయాన్ని శ్రుతిహాసన్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ వేదాళమ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు. ఎంతో వినయంగా ప్రవర్తించే దర్శకుడు శివ దర్శకత్వంలో నటించడం తీయని అనుభవం అని పేర్కొన్నారు. వేదాళం చిత్ర యూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.మరో పక్క చిత్ర టీజర్ విడుదలై అభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది. దీపావళికి తెరపైకి రానున్న వేదాళమ్ చిత్రంపై అజిత్ అభిమానులతో పాటు చిత్ర వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.     

Advertisement
 
Advertisement
Advertisement