ఎయిర్‌టెల్ కస్టమైజ్డ్ ప్లాన్స్ | airtel customised plans | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ కస్టమైజ్డ్ ప్లాన్స్

Oct 12 2013 1:52 AM | Updated on Sep 1 2017 11:34 PM

భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కస్టమైజ్‌డ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమ వినియోగ ప్రాధాన్యతలను బట్టి ఈ ప్లాన్లను కస్టమైజ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్‌టెల్ సీఎంఓ(కన్సూమర్ బిజినెస్) గోవింద్ రాజన్ పేర్కొన్నారు.

 న్యూఢిల్లీ:  భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కస్టమైజ్‌డ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమ వినియోగ ప్రాధాన్యతలను బట్టి ఈ ప్లాన్లను కస్టమైజ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్‌టెల్ సీఎంఓ(కన్సూమర్ బిజినెస్) గోవింద్ రాజన్ పేర్కొన్నారు. రూ.199 నుంచి రూ.999 రేంజ్‌లో  ఐదు రెంటల్ ఆప్షన్లనందిస్తున్నామని వివరించారు.
 
  తామందిస్తున్న ఈ ప్లాన్స్‌ల్లో ఫ్రీ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, డేటా యూసేజ్.. ఇవన్నీ నిర్దేశిత యూనిట్లలో ఉంటాయని వివరిం చారు. కొంత మంది లోకల్ కాల్స్  మీద, మరికొంతమంది ఎస్‌టీడీ కాల్స్ మీద, ఇంకొంతమంది డేటా వినియోగంపైనే ఎక్కువ ఖర్చు చేస్తారని పేర్కొన్నా రు. వినియోగదారులు తమ అవసరాలకనుగుణంగా ఈ ప్లాన్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చని వివరించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement