మధ్యప్రదేశ్లో ట్రక్ బోల్తా: 14 మంది మృతి | Accident in madhya pradesh, 14 killed, 24 injured | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్లో ట్రక్ బోల్తా: 14 మంది మృతి

Nov 13 2013 9:27 AM | Updated on Sep 2 2017 12:34 AM

మధ్యప్రదేశ్లోని ధాతియా జిల్లా రావల్ పూరా సమీపంలో బుధవారం ఉదయం ట్రక్ బోల్తా పడింది.

మధ్యప్రదేశ్లోని ధాతియా జిల్లా రావల్ పూరా సమీపంలో బుధవారం ఉదయం ట్రక్ బోల్తా పడింది. ఆ ఘటనలో 14 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది కూలీలకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ధాతియా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రక్లో ప్రయాణిస్తున్న వారంతా కూలీలే అని పోలీసులు చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement