మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక | Abdulla Yameen new Maldives president | Sakshi
Sakshi News home page

మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక

Nov 17 2013 3:28 AM | Updated on Sep 2 2017 12:40 AM

మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్(54) ఎన్నికయ్యారు.

మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్(54) ఎన్నికయ్యారు. మాజీ నియంతృత్వ పాలకుడు మౌమూన్ గయూమ్‌కు సవతి సోదరుడైన అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించి, ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌కు 48. 61 శాతం ఓట్లు లభిం చాయి. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లోనూ మెజారిటీ సాధించిన నషీద్ ఈ పరాజయం ఊహించలేదు. ఆ రెండు పర్యాయాలు కూడా 50 శాతం ఓట్లు సాధించకపోవడంతో ఆయనను విజేతగా ప్రకటించలేదు. మజ్లిస్(మాల్దీవుల పార్లమెంట్)లో అబ్దుల్లా ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement