మేధా పాట్కర్కు మద్దతిస్తాం: ఏఏపీ | Aam Aadmi Party to support Medha Patkar if she contests Lok Sabha polls | Sakshi
Sakshi News home page

మేధా పాట్కర్కు మద్దతిస్తాం: ఏఏపీ

Feb 12 2014 7:50 PM | Updated on Apr 4 2018 7:42 PM

మేధా పాట్కర్కు మద్దతిస్తాం: ఏఏపీ - Sakshi

మేధా పాట్కర్కు మద్దతిస్తాం: ఏఏపీ

సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) ప్రకటించింది.

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆమె భావిస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని  ఏఏపీ సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. పోటీ చేయాలా, వద్దా అనేది ఆమె నిర్ణయించుకోవాలని సూచించారు. మేధా పాట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెకు సంపూర్ణ మద్దతు పలుకుతామని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేసిన మేధా పాట్కర్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇంకా ఏఏపీలో చేరలేదు. వాయవ్య ముంబై స్థానం నుంచి ఆమె పోటీ అవకాశాలున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మురికివాడలను ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నించినప్పుడు మేధా పాట్కర్ బాధితుల తరపున పోరాటం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement