‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని | Aadhar Continues, says Nandan Nilekani | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని

Feb 3 2014 10:17 PM | Updated on May 25 2018 6:12 PM

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని - Sakshi

‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని

‘ఆధార్ బహుళ ఉపయోగ వేదిక. అందులో ఎల్‌పీజీ కూడా ఒకటి. ఆధార్ పాత్ర కొనసాగుతుందనే విశ్వాసముంది’ అని ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని అన్నారు.

బెంగళూరు: ‘ఆధార్ బహుళ ఉపయోగ వేదిక. అందులో ఎల్‌పీజీ కూడా ఒకటి. ఆధార్ పాత్ర కొనసాగుతుందనే విశ్వాసముంది’ అని ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని అన్నారు. ‘ఐడియాస్ ఫర్ బెంగళూరు’ పేరిట సోమవారం ఓ కాలేజీలో విద్యార్థినుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి నీలేకని పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది. అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement