ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్.. | A car for women? Cosmopolitan and SEAT under fire for new vehicle | Sakshi
Sakshi News home page

ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్..

Sep 23 2016 7:56 PM | Updated on Sep 15 2018 8:28 PM

ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్.. - Sakshi

ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్..

స్పానిస్ కారు తయారీదారి సీట్, లేడిస్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ కాస్మోపాలిటన్ కలిసి కేవలం మహిళల కోసం ఓ కొత్త కారు రూపొందించి లండన్ కాస్మోపాలిటన్స్ ఫ్యాస్ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశాయి.

చిన్నగా... పర్ఫుల్ కలర్లో కనిపించే ఈ కారు చూడానికి భళే ఉందికదా!  ఎప్పుడూ మగవారికోసమే కార్లు, బైక్స్ ఏం తయారుచేస్తాంలే అని భావించిన ఓ రెండు కంపెనీలు జతకట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కారును డిజైన్ చేశాయి. స్పానిస్ కారు తయారీదారి సీట్, లేడిస్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ కాస్మోపాలిటన్  కలిసి కేవలం మహిళల కోసం ఓ కొత్త కారు రూపొందించి లండన్ కాస్మోపాలిటన్స్ ఫ్యాస్ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశాయి. మహిళలు ఎలాగైతే మేకప్ చేసుకుంటారో అదేమాదిరి కారును డిజైన్ చేశారు. జ్యువెల్ ఎఫెక్ట్ రిమ్స్, హ్యాండ్ బ్యాగ్ హుక్, ఐలైనర్ హెడ్లైట్స్ తో సీట్ మి కారు మార్కెట్లోకి వచ్చింది.  సీట్ కారు తయారీదారి, లేడీస్ మ్యాగజైన్ రెండేళ్ల రీసెర్చ్, డెవలప్మెంట్తో మహిళల అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది.  
 
అయితే ఓ వైపు ఈ కారు రూపొందించినందుకు కృతజ్క్షతలు చెబుతూనే మరోవైపు సెటైర్లు కూడా వేస్తున్నారు. తమ సుతిమెత్తని చేతుల మాదిరి స్టీరింగ్ వీల్ చిన్నదిగా ఉందా అంటూ ట్వీట్లు వస్తున్నాయి. మహిళల డిజైన్తో ఈ కారు రూపొందించడం గుడ్ ఐడియానా అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన సీట్ కారు తయారీదారు ఈ కారు కేవలం కాస్మోపాలిటన్ రీడర్స్ కోసమే తయారుచేసినట్టు చెబుతోంది. కాస్మోపాలిటన్ రీడర్స్, ఎడిటర్స్, మ్యాగజైన్ క్రియేటివ్ టీమ్ సహకారంతో కేవలం పరిమిత టార్గెట్తోనే వచ్చినట్టు పేర్కొంది. మహిళల అందరికోసమేమీ ఈ కారు తయారుచేయలేదని పేర్కొంది. కానీ లాంచ్ చేసిన కొన్నిరోజులకే ఈ బ్రాండెడ్ న్యూ కారుపై ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement