లైంగిక వేధింపులకు గురయ్యే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు విచారణ పూర్తయ్యే వరకు..
న్యూఢిల్లీ: పనిచేసేచోట లైంగిక వేధింపులకు గురయ్యే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు విచారణ పూర్తయ్యే వరకు 90 రోజులు జీతంతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీఓపీటీ) సర్వీస్ రూల్స్‌ను సవరించింది.
సాధారణ సెలవులకు ఇవి అదనమని డీఓపీటీ స్పష్టం చేసింది. సంస్థలోని అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీలు 90 రోజుల సెలవుల కోసం సిఫార్సు చేస్తాయని తెలిపింది.