రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి | 54 infant deaths at Cuttack hospital in 2 weeks | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

Sep 1 2015 9:26 AM | Updated on Sep 3 2017 8:33 AM

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

ఒడిశా కటక్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్దార్ వల్లభాయిపటేల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిడియాట్రిక్స్ సంస్థలో నవజాత శిశువులు వరుసగా మరణిస్తున్నారు.

భువనేశ్వర్ : ఒడిశా కటక్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్దార్ వల్లభాయిపటేల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిడియాట్రిక్స్ సంస్థలో నవజాత శిశువులు వరుసగా మరణిస్తున్నారు. గత 14 రోజుల్లో 54 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ సంఘటనతో నవీన్ పట్నాయిక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అటాన్ సబ్యసాచి నాయక్ వెల్లడించారు. నవజాత శిశువుల మరణాలకు గల కారణంపై ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు.

అయితే ఆసుపత్రిలో మృతి చెందిన శిశువులకు పోస్ట్ మార్టం నిర్వహించడం లేదని బీజేపీ ఆరోపించింది. శిశువు మృతికి నిరసనగా సెప్టెంబర్ 2 తేదీన రాష్ట్రంలో బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా శిశువుల మరణాలపై స్పందించింది.  త్వరలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఆసుపత్రిని సందర్శిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement