రూ.400 కోట్లతో దేశంలోని 4 వేల అంగన్‌వాడీల ఆధునీకరణకు వేదాంత గ్రూప్, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.
వేదాంత గ్రూప్‌తో కేంద్రం ఒప్పందం
న్యూఢిల్లీ: రూ.400 కోట్లతో దేశంలోని 4 వేల అంగన్‌వాడీల ఆధునీకరణకు వేదాంత గ్రూప్, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్‌కుమార్, వేదాంత అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మయాంక్ అషార్ సోమవారం దీనిపై సంతకాలు చేశారు.బాలలకు విద్య, పౌష్టికాహారం, మహిళలకు వృత్తినైపుణ్యాలు కల్పించడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని రాజేశ్‌కుమార్ చెప్పారు.
కేవలం పౌష్టికాహారం అందించడానికే కాకుండా గ్రామాల్లో వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేయడం, సమాజాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం అయ్యేలా శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు అంగన్‌వాడీలను ఈ ప్రాజెక్టు కింద ఆధునికీకరించనున్నారు.