గొంతుకోసుకుని చనిపోయింది | 30-Year-Old Model in Mumbai Found Dead With Throat Slit | Sakshi
Sakshi News home page

గొంతుకోసుకుని చనిపోయింది

May 17 2015 9:34 PM | Updated on Sep 3 2017 2:14 AM

గొంతుకోసుకుని చనిపోయింది

గొంతుకోసుకుని చనిపోయింది

ఓ మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ముంబయిలోని ఓ ఆపార్ట్ మెంట్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ముంబయి: ఓ మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ముంబయిలోని ఓ ఆపార్ట్ మెంట్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన శిఖా జోషి అనే మోడల్ గత ఎనిమిదేళ్లుగా ముంబయిలో ఉంటోంది. మూడు నెలల కిందటే మధు అనే తన స్నేహితురాలు ఇంటికి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి లోనైట్లు కనిపించిన శిఖా ఉన్నట్లుండి గొంతు కోసుకుని మధు బాత్ రూం వద్ద పడి ఉండటంతో మధు దంపతులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. శిఖా సోదరుడు విశేష్ జోషి చెప్పిన ప్రకారం గతంతో శిఖాకు కాస్మోటిక్ సర్జరీలు నిర్వహించే ఓ వైద్యుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దీంతో ఆమె కేసు పెట్టిందని, ఆ కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరింపులు, ఒత్తిడిలకు గురిచేశారు. దీంతో ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement