ఇద్దరు చిన్నారులను బావిలో పారేసిన తండ్రి | 2 died, father throws his children's into Wel | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారులను బావిలో పారేసిన తండ్రి

Dec 10 2013 7:58 PM | Updated on Jul 10 2019 8:02 PM

జిల్లాలోని పొదిలి మండలం కంబాలపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పోషణ చూడాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులపాలిట కాలయముడైయ్యాడు.

ప్రకాశం: జిల్లాలోని పొదిలి మండలం కంబాలపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పోషణ చూడాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులపాలిట కాలయముడైయ్యాడు.  ఆ పిల్లలిద్దరినీ బావిలో పడేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

భార్యభర్తలు గొడవల కారణంగానే తన పిల్లలను చంపినట్టు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement