ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ కారు బాంబులతో దద్దరిల్లింది. నగరంలో శనివారం వివిధ ప్రాంతాల్లో నాలుగు కారు బాంబు పేలుళ్లు సంభవించాయి.
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ కారు బాంబులతో దద్దరిల్లింది. నగరంలో శనివారం వివిధ ప్రాంతాల్లో నాలుగు కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో మొత్తం 18 పౌరులు మరణించారు. మరో 59 మంది పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.
అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో హింస, తీవ్రవాదాల కారణంగా 5,576 మంది మరణించగా, 11,666 మంది గాయపడ్డారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్, మానవహక్కుల హై కమిషనర్ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.