కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది.
	తిరువనంతపురం : కేరళకు చెందిన 17 మంది యువతీ యువకులు తీవ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని వార్తలు రావడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం దర్యాప్తునకు ఆదేశించింది.  ఉన్నత చదువుల కోసం పశ్చిమాసియా దేశాలకు వెళ్లిన వారి జాడ నెల నుంచి తెలియడంలేదని కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగుచూసింది. తప్పిపోయిన వారిలో 8 నెలల గర్భిణి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.
	
	కొందరు ఇంజినీరింగ్, వైద్య  విద్యను అభ్యసించారు. వీరు ఐసిస్‌లో చేరారని కచ్చితంగా చెప్పలేమని, వీరి  కుటుంబాలు అందించిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
