షాంఘైలో ప్రమాదం: 15 మంది దుర్మరణం | 15 die in ammonia leak in Shanghai | Sakshi
Sakshi News home page

షాంఘైలో ప్రమాదం: 15 మంది దుర్మరణం

Aug 31 2013 1:47 PM | Updated on Sep 1 2017 10:19 PM

షాంఘైలో వెంగ్స్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రియల్ కంపెనీలోని రిఫ్రిజరేషన్ యూనిట్లో శనివారం ద్రవ అమోనియా విడుదలై 15 మంది కార్మికులు మరణించారు.

చైనాలోని షాంఘై నగరంలో వెంగ్స్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రియల్ కంపెనీలోని రిఫ్రిజరేషన్ యూనిట్లో ఈ రోజు ఉదయం ద్రవ అమోనియా గ్యాస్ విడుదలై 15 మంది కార్మికులు మరణించారని ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. మరో 26 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement