నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది | 11 of family suffocate to death in Pakistan | Sakshi
Sakshi News home page

నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది

Jan 29 2015 1:05 PM | Updated on Sep 2 2017 8:29 PM

నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది

నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది

పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం పిష్ని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గత రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు.

అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దీంతో వారంతా ఊపిరాడక నిద్రలోనే మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాన్ని ప్రచురించింది.

Advertisement
 
Advertisement
Advertisement