ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్లో ఆత్మాహుతి దళ సభ్యుడొకరు కారు బాంబు పేల్చేసుకోవడంతో 10 మంది మరణించగా 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్లో ఆత్మాహుతి దళ సభ్యుడొకరు కారు బాంబు పేల్చేసుకోవడంతో 10 మంది మరణించగా 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్లోని తూర్పున ఉన్న సదర్ నగరంలో ఓ మార్కెట్ వద్ద అతడు ఈ కారు బాంబు పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా సమీపంలో ఉన్న పలు దుకాణాలు, భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే, ఈ దాడికి పాల్పడింది తామంటూ ఎవరూ చెప్పుకోలేదు. ఈనెల 30వ తేదీన ఇరాక్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. 2011 చివర్లో అమెరికా దళాలు ఇరాక్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ దేశంలో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.