సాహో పోస్టర్‌: కల్కిగా మందిరాబేడీ

Saaho: Mandira Bedi Poster Released - Sakshi

‘సాహో’ పోస్టర్ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ‘కల్కి’ పాత్ర పోషించిన మందిరా బేడి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సినిమాలో నటించిన వారి పాత్రలను పరిచయం చేస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర దర్శకుడు సుజీత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా పోస్టర్లను రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘గుడ్‌ ఇస్‌ బ్యాడ్‌’ (మంచి చెడుగా మారినప్పుడు) అనే ట్యాగ్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో మందిరా మెటాలిక్‌ బ్లాక్‌, గ్రే కలర్‌ శారీలో చిన్న జుట్టుతో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తోంది. దీంతో పాటు జెన్నిఫర్‌గా నటించిన హాలీవుడ్‌ నటి ఎవ్లీన్‌ శర్మ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలను దాదాపు 90 కోట్ల ఖర్చుతో అబుదాబిలో చిత్రీకరించారు. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమాలో ఇదే హైలెట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మరోవైపు సాహో ట్రైలర్‌ను ఈ నెల 10వ తేదీన రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు ట్విట్టర్‌లో ప్రకటించారు.  

 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top