వైఎస్సార్‌ హయాంలోనే పేదలకు న్యాయం

Youth join YSRCP in Sircilla - Sakshi

సిరిసిల్లటౌన్‌ : వైఎస్సార్‌ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని పేదలకు న్యాయం దక్కిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో సర్కారు ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయం ఆసన్నమైందని, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సమాయత్తం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు.

స్థానిక సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బెంబెడ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, రాష్ట్ర నాయకులు జక్కుల యాదగిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గడ్డం జలజారెడ్డి, గుంటుకు సంపత్, జిల్లా చీఫ్‌ సెక్రటరీ వంగరి అనిల్, ప్ర«ధాన కార్యదర్శి గుండేటి శేఖర్, టౌన్‌ ప్రెసిడెంట్‌ బూర నాగరాజు, జిల్లా కార్యదర్శులు కొత్వాల రవి, బొడ్డు శ్రీనివాస్, పల్లె రవి, తీగల శ్రీనివాస్‌రెడ్డి, అనుములు శ్రీకాంత్‌రెడ్డి, కడుగుల నాగరాజు, ఎండి. యూనుస్, ఎల్లయ్య, తిరుపతిరెడ్డి, తిరుపతి, హైదర్, నవీన్‌ పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపైనే బస్సుయాత్ర
సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జూన్‌ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్‌ తెలిపారు. యాత్ర రూట్‌మ్యాప్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధిష్టానానికి నివేదించి, సర్కారును నిలదీస్తామన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన యువకులను అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top