ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య | Youngster commits Suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

Jul 6 2015 8:11 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

ఉప్పల్ (హైదరాబాద్) : ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉప్పల్ సర్వే కాలనీకి చెందిన కిరణ్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. కాగా గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఇబ్బందులు తీవ్రమవడంతో సోమవారం ఇంట్లోనే చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement