తనను ప్రేమించడం లేదని... | Youngster attempts Suicide for Love | Sakshi
Sakshi News home page

తనను ప్రేమించడం లేదని...

Jun 22 2015 3:06 PM | Updated on Sep 3 2017 4:11 AM

ప్రేమ కోసం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

మిర్యాలగూడ (నల్లగొండ) : ప్రేమ కోసం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజు(25) మిర్యాలగూడలోని కపిల్ చిట్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో ఇతడికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తనను ప్రేమించడం లేదంటూ సోమవారం అవంతిపురం గ్రామంలో నాగరాజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement