యువతి అదృశ్యం | young woman gone in keesara | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Dec 18 2015 2:25 AM | Updated on Aug 11 2018 8:11 PM

యువతి అదృశ్యం - Sakshi

యువతి అదృశ్యం

ఇంటి నుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందిందని సీఐ గురువారెడ్డి తెలిపారు.

కీసర : ఇంటి నుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందిందని సీఐ గురువారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన కాసర్ల ధనలక్ష్మి (19) నగరంలోని కోరంటి ఆస్పత్రిలో ఎంఎల్‌టీ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది. కాగా ఈనెల 16న (బుధవారం) రోజు మాదిరే ఆస్పత్రికి వెళుతున్నట్లు ధనలక్ష్మీ ఇంటి నుంచి వెళ్లింది. గురువారం వరకు కూడా ధనలక్ష్మి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి రాజమల్లు కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement