ఆగస్టులో ‘పోలీసు’ రాత పరీక్ష | Written exam to the Police replacement jobs on August | Sakshi
Sakshi News home page

ఆగస్టులో ‘పోలీసు’ రాత పరీక్ష

Jun 12 2018 1:37 AM | Updated on Aug 21 2018 7:25 PM

Written exam to the Police replacement jobs on August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్‌ ఉద్యోగాల (18,428 పోస్టులు) భర్తీకి సంబంధించిన రాత పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. టీ–శాట్‌ నెట్‌వర్క్‌ చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియామకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎనిమిది నెలల్లో నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏమైనా అనుమానాలుంటే బోర్డు హెల్ప్‌లైన్, వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement