ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి | Worker killed in warangal district | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి

Apr 11 2015 11:31 AM | Updated on Sep 3 2017 12:10 AM

ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి

ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి

ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు.

వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో శనివారం జరిగింది. వివరాలు.. ఇల్లంద గ్రామానికి చెందిన వీరయ్య (28) గీత కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తాటిచెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  విషయం తెలుసుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(వర్ధన్నపేట)

Advertisement
 
Advertisement
Advertisement