పనిచేస్తే పదవులు అవే వస్తాయి | Work properly posts will come automatically | Sakshi
Sakshi News home page

పనిచేస్తే పదవులు అవే వస్తాయి

Jul 12 2015 2:13 AM | Updated on Sep 3 2017 5:19 AM

ఎందరో త్యాగధనుల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రతి

 ఖమ్మంరూరల్ :  ఎందరో త్యాగధనుల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లిలో జరిగిన టీఆఆర్‌ఎస్  రూరల్ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయూలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.  పని చేసుకుంటూపోతే పదవులు అవే వస్తాయన్నారు. ఎంఎల్‌సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ రాబోయే ఎంఎల్‌సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకోసం నాయకులు కృషి చేయాలన్నారు.

అనంతరం రూరల్ మండలానికి సాగునీరు అందించేందుకు ఆకేరు,మున్నేటి నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ధరావత్ రాంమూర్తినాయక్,జడ్‌పీటీసీ ధరావత్ బారతి,టీఆర్‌ఎస్‌కార్మిక విభాగం మండల అధ్యక్షుడు పసుపులేటి లక్ష్మయ్య,టీఆర్‌ఎస్‌జిల్లా  నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండలనాయకులు మద్ది మల్లారెడ్డి,బత్తుల సోమయ్య,మంకెన నాగేశ్వరరావు,వీరెల్లి అప్పారావు,తేజావత్ పంతులునాయక్, మీసాల రాంచంద్రు,తొండల రాంబాబు,,బీరెడ్డి నాగచంద్రారెడ్డి,కొప్పుల ఆంజనేయులు, టీఆర్‌ఎస్ సర్పంచ్‌లు యాదాల హైమావతి, తేజావత్ ఎల్లయ్యనాయక్,వడ్డే కస్తూరమ్మ,ఆరెంపుల రజని,చెరుకుపల్లి లక్ష్మి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement