మహిళల స్వీయ చరిత్రలు.. సామాజిక దర్పణాలు | Women's self-histories .. the social mirror | Sakshi
Sakshi News home page

మహిళల స్వీయ చరిత్రలు.. సామాజిక దర్పణాలు

Mar 30 2014 3:41 AM | Updated on Sep 2 2017 5:20 AM

మహిళల స్వీయ చరిత్రలు..సామాజిక దర్పణాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అభివర్ణించారు.

కేయూ క్యాంపస్, న్యూస్‌ైలైన్ : మహిళల స్వీయ చరిత్రలు..సామాజిక దర్పణాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అభివర్ణించారు. ‘భారత దేశంలో మహిళల స్వీయ చరిత్రలు’ అంశంపై కేయూ సెనేట్‌హాల్‌లో శనివారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆంగ్ల విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సును వీసీ ప్రారంభించి మాట్లాడారు.

మహిళల స్వీయరచనల్లో సామాజిక కట్టుబాట్లు, మానవ సంబంధాలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఒడిదుడుకులు కళ్లకు కట్టినట్లు ప్రతి బింబిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన తల్లి కుటుంబాన్ని నడిపిన నేపథ్యాన్ని, తన అనుభవాన్ని వివరించారు. హైదరాబాద్ ఇంగ్లిష్, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ సుషిథారు కీలకోపన్యాసం చేశారు. 19వ శతాబ్దం లోనే భారతదేశంలో మహిళలు స్వీయచరిత్రలు రాసుకోవడం కొత్త సాహిత్య ప్రక్రియ అని వివరిం చారు.

బుద్ధుడి కాలంలోనే మహిళలు తమ ఆలోచన విధానాన్ని తెలిపారని వివరించారు. సామాజిక కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుని తమ ఆలోచన విధానాన్ని వ్యక్తీకరించడం విప్లవాత్మక పరిణామమ న్నారు. ఈ దశలో కమలాదాస్, నయనతార సెహగల్, శోభాడే, మృణాల్ పాండే, బేబీ కాంబ్లే స్వీయ జీవిత చరిత్రలు నూతన ఆలోచనలు రేకెత్తించాయని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా మహిళల పాత్ర కూడా ఎక్కువగా ఉందని వివరించారు. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఉన్నతవర్గాల మహిళల జీవిత చరిత్రలు ఎక్కువగా రాజకీయాల వంటి విషయాలతో కూడుకున్నాయని, దిగువ తరగతి మహిళల రచనల్లో ఎక్కువగా మానవ సంబంధాలు, కుటుంబ నేపథ్యం గోచరి స్తుందన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ మహిళల మానసిక సంఘర్షణ స్వీయ రచన ల్లో కనిపిస్తాయని అన్నారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన  కేయూ ఇంగ్లిష్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.పురుషోత్తం మాట్లాడుతూ భారతదేశంలో కూడా స్వీయ చరిత్రలున్నాయని, వాటిని పరిశోధనల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా తమ విభాగంలో నలుగురు పరిశోధనలు కూడా చేస్తున్నారని, అందుకే ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా కేయూ జర్నల్ ఆఫ్ ఇంగ్లిష్ స్టడీస్‌ను వీసీ వెంకటరత్నం, ప్రొఫెసర్ పురుషోత్తం రాసిన బ్లాక్‌లియస్ పుస్తకాన్ని వీసీ వెంకటరత్నం, సుషిథారు ఆవిష్కరించారు. సదస్సులో క్యాంపస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.దామోదర్‌రావు, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.రాజగోపాలాచారి, ప్రొఫెసర్ ఎం.రాజేశ్వర్, ప్రొఫెసర్ పి.శైలజ, ప్రొఫెసర్ వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement