మహిళ గొంతుకోసి నగలతో పరారీ | Woman's throat cut during robbery in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

మహిళ గొంతుకోసి నగలతో పరారీ

May 10 2014 9:00 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లాలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది.

మహబూబ్నగర్ జిల్లాలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం రంగంపేటలో దుండగులు ఓ ఇంటిలో చోరీకి యత్నించారు. ఆ క్రమంలో ఇంట్లోని ఒంటరి మహిళ దుండగులను ప్రతిఘటించింది. దాంతో దుండగులు మహిళ గొంతుకోసి అనంతరం ఇంట్లోని నగలు తీసుకుని పరారైయ్యారు.

 

రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను చూసి పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మహిళను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement