కత్తులతో పొడిచి మహిళ దారుణ హత్య | woman murdered in knife attack | Sakshi
Sakshi News home page

కత్తులతో పొడిచి మహిళ దారుణ హత్య

May 11 2016 7:08 AM | Updated on Sep 3 2017 11:53 PM

నల్గొండ జిల్లా మోత్కూరు మండలం తాటిమట్ల గ్రామంలో పట్నూరు సావిత్రమ్మ(48) అనే మహిళ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురైంది.

మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం తాటిమట్ల గ్రామంలో పట్నూరు సావిత్రమ్మ(48) అనే మహిళ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. భర్త నుంచి విడిపోయి సావిత్రమ్మ కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటోంది. గుర్తుతెలియని దుండగులు బుధవారం వేకువజామున ఆమె ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో పొడిచి హత్యచేశారు. నగలు, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారా?. లేక పాత కక్షలేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. సావిత్రమ్మ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement