ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

Woman Gives Birth To Baby Outside At Government Hospital In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోరబండలో దారుణం చోటుచేసుకుంది. రోగులకు నిరంతరం సేవలందించాల్సిన హాస్పిటల్‌కు గడియపెట్టి వెళ్లిన సిబ్బంది పత్తా లేకుండా పోయారు. వారి నిర్వాకంతో ఓ గర్భిణి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు రావడంతో మరియమ్మ అనే గర్భిణి పర్వతనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి కాన్పుకోసం వచ్చింది. దవఖానాకు గేట్లు మూసి ఉండటంతో గంటసేపు బయటే పడిగాపులు కాశారు. నొప్పులు మరింత ఎక్కువ కావడంతో ఆరుబయటే ప్రసవం అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నైట్‌ షిప్టులో పనిచేసే సిబ్బంది సమయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top