
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన వ్యవసాయ భూమి కబ్జాకు గురికావడంతో ఆమె పురుగుల మందు తాగినట్టుగా తెలుస్తోంది. ఇది గమనించిన బాధితురాలి బంధువులు ఆమె చర్యను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే మహిళా రైతును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు బాధితురాలి భూమిని కబ్జా చేసినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు రక్షణగా ఉండాల్సిన సర్పంచే తన భూమిని కబ్జా చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైనట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.