టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడించే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజు తదితరులు స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడించే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజు తదితరులు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన్ను మాట్లాడనిస్తామని, లేకుంటే అసెంబ్లీ నుంచి తరిమికొడతామని అన్నారు.
ప్రజాసమస్యలు తెలుసుకుంటున్న కేసీఆర్ యాత్రలను సైతం టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హెరిటేజ్ పాలు తాగిన లోకేష్.. అమూల్ బేబీలా మాట్లాడుతున్నాడని కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజు ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని వారు విమర్శించారు.


