జైలుకు తరలించిన పోలీసులు

Wife who Killed her Husband by a Lover in Nalgonda - Sakshi

ప్రియుడు అతని స్నేహితులతో కలిసి భర్తను అంతమొందించిన భార్య

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతుడి నోట్లో, శరీరంపై పురుగులమందు పోసిన వైనం

వీడిన హత్య కేసు మిస్టరీ, ఐదుగురు నిందితుల అరెస్ట్‌

కేసు వివరాలను వెల్లడించిన ఏఎస్పీ పద్మనాభరెడ్డి

శాలిగౌరారం(తుంగతుర్తి) : మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఈనెల 10న వెలుగుచూసిన గుండెబోయిన మల్లేష్‌ హత్య కేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. కట్టుకున్న భార్యే తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. చిత్తలూరు గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్‌(29)కు భార్య మమతతో పాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్‌కు గ్రామంలో 4ఎకరాల  వ్యవసాయ భూమి ఉంది. దాంతో పాటు గ్రామానికి చెందిన తరాల పద్మమ్మ వద్ద మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేసేవాడు. పంటసాగులో భాగంగా దుక్కి దున్నడం మొదలుకుని పత్తిని ఇంటికి చేర్చేవరకు చిత్తలూరు గ్రా మానికి చెందిన పూల సోమయ్య అలియాస్‌ సో మన్నకు సంబంధించిన ట్రాక్టర్‌ను మల్లేష్‌ కిరా యికి వినయోగించుకునేవాడు. ఈ క్రమంలో తరు చూ ఇంటికి వచ్చిపోతున్న సోమయ్యతో మల్లేష్‌ భార్య మమతకు పరిచయం ఏర్పడింది. అది కా స్తా ఎక్కువై అతి చనువుగా మారడంతో వివాహేతన సంబంధానికి దారి తీసిం ది.

ఈ నేపథ్యంలో మల్లేష్‌కు భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్మవహారశైలిపై అనుమానం వచ్చింది. దీంతో మల్లేష్‌ తన స్నేహితుడైన సోమయ్యను భార్య మమతను తీవ్రస్థాయిలో మందలించా డు. అయినా భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో భార్య మమతను కొట్టేవాడు. ఈ క్రమంలో తాగుడుకు అలవాటుపడిన మల్లేష్‌ తాగివచ్చినప్పుడు భార్య మమతను వేధింపులకు గురిచేయడంతో పాటు చంపుతానని బెదిరించేవాడు. దీంతో ఇం ట్లో జరుగుతున్న విషయాన్ని మమత ఆమె ప్రి యుడు సోమయ్యకు వివరించింది. నేను ఇబ్బందులతో బతకలేనని, నన్ను నా భర్త మల్లేష్‌ చంపుతానంటున్నాడని, నేను చచ్చిపోతానని చెప్పింది. దీంతో సోమయ్య మమతకు ధైర్యం చెప్పి నీవు చావడమెందుకు ఇద్దరం కలిసి నీ భర్త మల్లేష్‌ను చంపుదామని చెప్పాడు. అందుకు మల్లేష్‌ భార్య మమత కూడా ఒప్పుకోవడంతో ఎలాగైనా మల్లేష్‌ను హత్య చేద్దామని నిర్ణయించుకున్నారు.

పూటుగా మద్యం సేవించాడని..
ఈ నేపథ్యంలో ఈ నెల 9న రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన మల్లేష్‌  స్పృహ కోల్పోయి ఇంట్లోని హాలులో బెడ్‌పై నిద్రించాడు. ఈ విషయాన్ని అతని భార్య మమత ప్రియుడు సోమయ్యకు ఫోన్‌ద్వారా చేరవేసింది. దీంతో మల్లేష్‌ను హత్య చేసేందుకు ఇదే అదునుగా భావించిన సోమయ్య తన స్నేహితులైన అదే గ్రామానికి చెందిన తరాల రాములు అలియాస్‌ రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లకు మద్యం తాపి విషయాన్ని వివరించాడు. మద్యం మత్తులో ఉన్న రాము, వినోద్‌కుమార్, మహేశ్‌లు రెండు ద్విచక్రవాహనాలపై సోమయ్యతో కలిసి అర్ధరాత్రి సమయంలో మల్లేష్‌ ఇంటకి వెళ్లారు. ఇంటి వెనుకభాగం నుంచి గోడదూకి మల్లేష్‌ ఇంట్లోకి ప్రవేశించి మమతను కలుసుకున్నారు. మద్యం మత్తులో స్పృహతప్పి నిద్రిస్తున్న మల్లేష్‌ ఛాతిపై సోమయ్య కూర్చొని ముఖంపై తలదిండుపెట్టి అదిమిపట్టాడు. స్పృహలోకి వచ్చిన మల్లేష్‌ వెంటనే సోమయ్య తలను పట్టుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మమత, తరాల రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మల్లేష్‌ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టి ఎటూ కదలకుండా చేశారు. దీంతో సోమయ్య మహేశ్‌ తలను పక్కనే ఉన్న బెడ్‌ అంచుకు బలంగా బాదడంతో తల వెనుకభాగం పగిలి రక్తస్రావం జరిగింది. వెంటనే బెడ్‌పై ఉన్న టవల్‌ను మల్లేశ్‌ నోట్లో కుక్కి ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనుమానం రాకుండా చేసేందుకు అప్పటికే థమ్సప్‌బాటిలో సిద్ధంగా ఉంచుకున్న పురుగుల మందును మృతిచెంది ఉన్న మల్లేశ్‌ నోట్లో పోయడంతో పాటు అతని బట్టలు, నేలపై పోసి వెళ్లిపోయారు.

మృతుడు గుండెబోయిన మల్లేశ్‌ తండ్రి శంభయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే కేసును ఛేదించి మల్లేశ్‌ను హత్య చేసిన గుండెబోయిన మమత, పూల సోమయ్య అలియాస్‌ సోమన్న, తరాల రాములు అలియాస్‌ రాము, తరాల వినో ద్‌కుమార్, బండారు మహేశ్‌లను సోమవారం అరెస్ట్‌ చేసి విచారించారు. హత్యానేరాన్ని వారు అంగీకరించడంతో వారిపై సెక్షన్‌ 448, 302, 120(బి), 201 రెడ్‌విత్‌ 34 ఐపిసి కింద కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ పద్మనాభరెడ్డి  తెలి పారు. మల్లేశ్‌ హత్యకు పాల్పడినవారిలో తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మైన ర్లు కావడంతో వారిని బాలనేరస్తులుగా గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం మమత, సోమయ్య, రాములును నకిరేకల్‌ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ ఆదేశానుసారం మమతను హైదరాబాద్‌లోని చెంచల్‌గూడ జైలు కు, సోములు, రాములును నల్లగొండలోని జిల్లా జైలుకు తరలించారు. తరాల వినోద్‌కుమార్, బం డారు మహేశ్‌లు మైనర్లు కావడంతో నల్లగొండలోని డీపీఓ ముందు హాజరు పరచడంతో జిల్లా కేంద్రంలోని జువైనల్‌హోంకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ క్యాస్ట్రో, ఎస్‌ఐ రాజు, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top