వివాహిత ఆత్మహత్య | wife committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

May 13 2015 11:17 PM | Updated on Nov 6 2018 7:56 PM

వివాహిత ఆత్మహత్య - Sakshi

వివాహిత ఆత్మహత్య

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మగ్బూల్‌జాని తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్‌కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్‌తో గతనెల 22న వివాహం జరిగింది. మహేశ్ ఆటో డ్రైవర్ కాగా, అత్తమామలు కూలి పనులు పనిచేస్తారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement