భార్యలు కొడుతుంటే భర్తలు లబోదిబో మంటూ పరుగులు తీస్తారు..
ఖమ్మం: భార్యలు కొడుతుంటే భర్తలు లబోదిబో మంటూ పరుగులు తీస్తారు..
ఇదేదో కోపంతో చేసిన పనికాదు..
గిరిజన సంప్రదాయ డూండ్ క్రీడలో భాగం..!
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని తండాలు గురువారం రాత్రి ఇందుకు వేదికలుగా మారాయి. డూండ్ అంటే వెతకటం అని అర్థం. గత ఏడాది హోలీ నుంచి ఇప్పటి వరకు తండాలో పుట్టిన మగ శిశువును హోలీ రోజు తెల్లవారు జామున ఆడవాళ్లంతా కలసి ఒక చోట దాచి పెడ్తారు. తండాలో గేర్యాలు(మగవాళ్లు) కర్రలు చేతబట్టుకుని ఆ బాలుడిని డూండ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాక అంతా కలసి కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం సాయంత్రం సదరు బాలుడి ఇంటి వద్ద గుమి కూడతారు. అక్కడ ఒక గుంజ చుట్టూ తినుబండరాలను బకెట్లలో ఉంచి తాళ్లతో వాటిని ఒకదానికొకటి బిగించి కడతారు. వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ కర్రలతో కాపలా ఉండగా మగవాళ్లు తినుబండారాలను తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో భార్యల చేతిలో భర్తలు దెబ్బలు తింటారు. అదీ అసలు విషయం.
(కారేపల్లి).