రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు? | Why not raise reservation? | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు?

Jan 11 2019 1:06 AM | Updated on Jan 11 2019 1:06 AM

Why not raise reservation? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చట్టం చేసే అధికారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రశ్నిం చారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే మైనార్టీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై కేవలం తీర్మానం చేసి పంపి కేంద్రంపై నెపం నెడుతున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ సిద్ధంగా లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నా రు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించాలనుకుం టే రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు.

తెలంగాణకు వివిధ గ్రాంట్లు, ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న నిధులపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. కేంద్ర సాయం విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలవి తప్పుడు ఆరోపణల న్నారు. కేంద్రంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ కేటీఆర్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకం అని తెలిపారు. రిజర్వాయర్లు లేకుండా దేవాదు ల ప్రాజెక్టును ఎలా చేపడతారని ప్రశ్నించారు. కంతనపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుకూలత ఉన్నా తుపాకుగూడెం వద్ద నిర్మించడం వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. శుక్ర, శనివారాల్లో బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు జరగనున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement