వాహ్వ్..వాట్సప్ | Whatsapp uses many ways | Sakshi
Sakshi News home page

వాహ్వ్..వాట్సప్

Dec 8 2014 2:25 AM | Updated on Sep 2 2017 5:47 PM

వాహ్వ్..వాట్సప్

వాహ్వ్..వాట్సప్

వాట్సప్... నేడు అత్యంత ఆదరణ కలిగిన యాప్.. ఇటీవల పుట్టుకొచ్చిన ఈ మొబైల్ యాప్ గురించి..

వాట్సప్... నేడు అత్యంత ఆదరణ కలిగిన యాప్.. ఇటీవల పుట్టుకొచ్చిన ఈ మొబైల్ యాప్ గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. మొబైల్‌లో టాక్‌టైమ్ లేకపోయినా కేవలం నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. ఈ యాప్ సహాయంతో ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు.. వీడియో చాట్ చేసుకోవచ్చు. గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఒకరి భావాలు ఒకరు పంచుకోవచ్చు.. అంటువంటి ఈ వాట్సప్‌కు నేటి యువత హ్యాట్సాప్ అంటున్నారు...        

ఇటీవల కాలంలో యువత నుంచి పెద్దల వరకు అందరూ వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. మీ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకుని ఆపై ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. మెస్సేజ్‌లు పంపుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అనుక్షణం తామేమీ చేస్తున్నా సెల్ఫీ( సొంత ఫొటో) తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారు.

అందుకు ఈ యాప్ ఎంతో అనువుగా ఉంటోంది. ప్రైవసీ కూడా ఉంటోంది. కేవలం ఫోన్ నంబర్ తెలిసి, ఈ యాప్‌లో రిజిస్టర్ అయిన వారికి మాత్రమే మన ఫొటోలు, సందేశాలు, వీడియోలు కనిపించే వీలుంటుంది. దీని ద్వారా కొంతమంది మిత్రులు కలిసి గ్రూపులు కట్టి తమ భావాలను పంచుకుంటున్నారు. ఇదే కాక ఇంకా అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హైక్, లైన్, వైబర్, చాట్ వంటిని వాటిల్లో ముఖ్యమైనవి.  

యువతకు ఎంతో ఉపయోగం...
ఒకప్పుడు మెస్సేజ్ పంపాలంటే నెట్‌వర్క్ పరిధిలోని సెల్ నంబర్ నుంచి వేరే సెల్‌కు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ స్మార్ట్ ఫోన్‌లు తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. మెస్సెంజర్స్ ద్వారా సందేశాలు పంపడమే కాకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాట్సప్, వైబర్, లైన్, హైక్, చాట్ తదితర యాప్స్ ఉపయోగించుకోవచ్చు. చాటింగ్, షేరింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ తరహా యాప్స్ రోజుకొకటి పుట్టుకొస్తున్నా యువత మాత్రం వాట్సన్, వైబర్, ఫేస్‌బుక్ తదితర వాటిని మాత్రమే వినియోగిస్తున్నారు.  

ఫేస్‌బుక్ మెసెంజర్....
వాట్సప్, వైబర్‌ల తర్వాత ఎక్కువమందిని ఆకర్షిస్తున్న యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్. ఫేస్‌బుక్ కు అడ్వాన్స్‌డ్ యాప్ ఇది. దీని ద్వారా చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫొటోలు పంపుకోవచ్చు. గంటల తరబడి చాట్ చేసుకోవచ్చు.
 
వైబర్...
వైబర్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఎంత సేపైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు.  
 
ఉపయోగకరంగా ఉంది :
నేను సంవత్సర కాలంగా వాట్సప్‌ను వాడుతున్నాను. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఫొటోలను, మెసెజ్‌లను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం ఖర్చులేకుండా సందేశాలను పంపుకునే వీలుంది.  
- ఎం భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా
 
అందరూ వాడుతున్నారు :
నేను ఆరు నెలలుగా వాట్సప్‌ను వాడుతున్నాను. నా స్నేహితులు ఎక్కువమంది వాట్సప్‌నే ఉపయోగిస్తున్నారు. అందువల్ల అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరి భావాలను షేర్ చేసుకుంటున్నాం. మెసేజ్ కానీ, ఫొటోకానీ షేర్ చేస్తే గ్రూప్‌లో అందరూ వాటిని చూసుకోవచ్చు. - ఎస్ సందీప్, బీటెక్ ఫైనలీయర్, ఖమ్మం
 
ఖర్చు తగ్గింది :

స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన హైక్, వాట్సప్, వైబర్, లైన్, చాట్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లు బాగున్నాయి. వీటి ద్వారా మొబైల్ ఖర్చు తగ్గుతుంది. టాక్‌టైం లేకపోయినా ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు తక్కువ ఖర్చుతో మాట్లాడుకోవచ్చు. సందేశాలు పంపుకునేందుకు వీలుంది.
 - కిరణ్, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వైరా
 
సమాచారం సులభంగా చేరవేయవచ్చు :
ప్రస్తుతం సమాచార విప్లవం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. విధి నిర్వహణలో వాట్సప్, వైబర్ వంటి యాప్స్ ద్వారా సమాచారాన్ని చేరవేయడం అతి సులువుగా ఉంటుంది. కిడ్నాప్‌లు వంటివి జరిగినప్పుడు సమాచారం మొబైల్ ద్వారా షేర్ చేయాడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా వల్ల ఎంతో మేలు జరుగుతుంది. - భూక్యా రాంరెడ్డి, డీఎస్పీ, వైరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement