వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్‌గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు.
వీణ - వాణిలకు నీటి కష్టాలు
Mar 29 2017 4:52 PM | Updated on Sep 5 2017 7:25 AM
హైదరాబాద్: వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్‌గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. హోం ఆవరణలో ఉన్న ఏడు భవనాలకు జలమండలి అధికారులు నీటి కనెక్షన్ కట్ చేశారు. స్టేట్ హోం తమకు రూ.24 లక్షల మేర చెల్లించాల్సి ఉందని జలమండలి అధికారులు అంటున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో కలిపి 700 మంది పైగా ఈ ఆవరణలో మూడు రోజులుగా నీళ్లు లేక అల్లాడుతున్నారు.
Advertisement
Advertisement