ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు.
దండేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఇన్‌చార్జి డాక్టర్ మాత్రమే ఉన్నారు.
శాశ్వత వైద్యుడు లేకపోవటంతో సేవలు సరిగా అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఎదుట రహదారిపై శనివారం మధ్యాహ్నం రాస్తారోకోకు దిగారు. దీంతో ఇన్‌చార్జి వైద్యుడు నవీన్ వారి వద్దకు వచ్చి.. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.