విజయ పాలు..లీటరు రూ.44

Vijaya Milk Prices Increased To Rs 44 - Sakshi

లీటరుపై రూ.2 పెంచిన టీఎస్‌డీడీసీఎఫ్‌

సోమవారం నుంచి అమల్లోకి

సాక్షి, హైదరాబాద్‌ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్‌) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్‌ పాలు, హోల్‌ మిల్క్‌ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్‌ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది.

పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top