రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు | Vigilance raid on ration shop | Sakshi
Sakshi News home page

రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు

Sep 15 2015 5:36 PM | Updated on Sep 3 2017 9:27 AM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. రేషన్ షాపు నంబర్ 5 లో అక్రమంగా పెద్ద మొత్తంలో సరుకులు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, 1.5 క్వింటాళ్ల పంచదారను సీజ్ చేశారు. నిర్వాహకుడు వెంకయ్యపై నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement