రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు | Vigilance officials raid ration shops | Sakshi
Sakshi News home page

రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు

Apr 18 2016 3:03 PM | Updated on Sep 3 2017 10:11 PM

జిన్నారం మండలంలోని చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు.

జిన్నారం (మెదక్) : జిన్నారం మండలంలోని చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. బొంతపల్లి, జిన్నారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లోని రికార్డులను, నిల్వ సరుకులను అధికారులు విద్యాకర్‌రెడ్డి, రమేశ్‌కుమార్, సాజత్‌మియా పరిశీలించారు. బొంతపల్లిలోని ఓ రేషన్ షాపులో కిరోసిన్ కోటాకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవటంతో సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాలు రుజువైతే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement