అపాయింటెడ్‌డే (జూన్ 2) తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీ, రేంజ్ డీఐజీలను మార్చడానికి కసరత్తు సాగుతున్నట్లు సమాచారం.
కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్ అధిష్టానం
హైదరాబాద్: అపాయింటెడ్‌డే (జూన్ 2) తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీ, రేంజ్ డీఐజీలను మార్చడానికి కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో ఇద్దరు ఎస్పీలు, దక్షిణ తెలంగాణలో మరో ఇద్దరు లేక ముగ్గురు ఎస్పీలను, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ రేంజ్ డీఐజీలలో ఇద్దరిని త్వరలో బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఎన్నికల్లో అధికార పార్టీ మంత్రుల చొరవతో వారికి పోస్టింగ్‌లు లభించినట్లు భావిస్తున్న టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు బాధ్యతల నిర్వహణలో వారు అలసత్వం ప్రదర్శించినట్లు ఫిర్యాదులు ఉండటం కూడా వారిని మార్చాలని నిర్ణయించడానికిగల కారణాల్లో ఒకటని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.