కే౦ద్ర సమాచార శాఖ అదనపు డీజీగా వెంకటేశ్వర్‌

Venkateswar Oppointed As Additional Director General of Central Information Department For Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్‌ జనరల్‌గా ఎస్‌. వెంకటేశ్వర్‌ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్‌ డిప్యుటేషన్‌ మీద హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్‌ ఫర్‌ ఇండియా(హైదరాబాద్) కార్యాలయంలో అదనపు ప్రెస్‌ రిజిస్టార్‌గా వ్యవహరించనున్నారు. అంతేగాక సమాచార, మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజనల్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరోకు అధిపతిగా వ్యవహరిస్తారు. 1989 ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు చెందిన ఎస్. వెంకటేశ్వర్‌ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పలు  విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 సంవత్సరాల సర్వీస్‌ కాలంలో పత్రికా సమాచార కార్యాలయం, బెంగుళూరు అదనపు డైరక్టర్‌ జనరల్‌గా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కార్యాలయం, భువనేశ్వర్‌ డైరక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top