
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులను ఆకట్టుకో డానికి రకరకాల చర్యలు తీసుకోవటం అవస రం. అందులో భాగంగానే గతంలో స్పీడ్ బోట్ల ను కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. కానీ చిన్నపాటి మరమ్మతుల పేరుతో వాటిని పక్కన పడేసింది. మరమ్మతు చేయగలిగే పరి జ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఏడా దిగా అవి పాడుబడిపోతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో బోట్ల అవసరం చాలా ఉంది. స్పీడ్ బోట్ల కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పర్యాటక శాఖాధికారులు మాత్రం బోట్లను పట్టించుకోవడం లేదు.
లుంబినీ పార్క్ వద్ద అవసరముందా?
స్పీడ్ బోట్ల మరమ్మతును పక్కనబెట్టిన పర్యాటక శాఖ.. తాజాగా బ్యాటరీతో నడిచే వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలుత కొన్ని వాహనాలను ఆర్డర్ ఇవ్వగా.. తొలివిడత రెండొచ్చాయి. వాటిలో ఓ వాహనాన్ని పూర్వపు వరంగల్ జిల్లాలోని లక్నవరం సరస్సు వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మరొకటి లుంబినీ పార్కులో పర్యాటకుల కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. అయితే పార్కులో అవసరం లేకున్నా ఓ వాహనాన్ని అందుబాటులో ఉంచా లనుకోవడం విస్మయం కలిగిస్తోంది. తరచూ వచ్చే వీఐపీల కోసం దాన్ని వినియోగించనున్నా రని సిబ్బంది చెబుతున్నారు.
వీఐపీల కోసమా.. పర్యాటకుల కోసమా..
బ్యాటరీ వాహనాల అవసరం ఉన్నా వాటిని ఎక్కడ వినియోగించాలనే నిర్ణయమూ అంతే అవసరం. పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండేందుకు, పర్యాటకులు నడవాల్సిన అవసరం ఉన్న చోట ఈ వాహనాల అవసరం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వాటిని వినియోగిస్తే పర్యాటకులూ హర్షిస్తారు. లక్నవరం ప్రధాన రోడ్డు నుంచి సరస్సు వరకు ఎక్కవ దూరం ఉంటుంది. పర్యావరణానికి ప్రాధాన్యమున్న ఆ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు బ్యాటరీ వాహనాల అవసరం ఉంది. కానీ తక్కువ దూరం ఉన్న లుంబినీ పార్కులో వాటి అవసరం లేదు. కానీ వీఐపీల కోసం ఖరీదైన బ్యాటరీ వాహనాన్ని వృథా చేయబోతున్నారని సమాచారం.