బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తితో పోరాడాలి | varavara rao speech in New Democracy National Convention | Sakshi
Sakshi News home page

బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తితో పోరాడాలి

Dec 28 2016 2:23 AM | Updated on Sep 4 2017 11:44 PM

బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తితో పోరాడాలి

బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తితో పోరాడాలి

బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తి తో అందరూ పోరాడాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. ఆటుపోట్లు ఎదురైనా అంతిమ విజయం విప్లవానిదేన న్నారు.

న్యూ డెమొక్రసీ జాతీయ సదస్సులో వరవరరావు  
సాక్షి, హైదరాబాద్‌: బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తి తో అందరూ పోరాడాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. ఆటుపోట్లు ఎదురైనా అంతిమ విజయం విప్లవానిదేన న్నారు. అక్టోబర్‌ విప్లవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం న్యూ డెమొక్రసీ నేతృత్వంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసం గించారు. నేడు దేశాన్ని శాసిస్తోన్న ఫాసిస్టు భావజాలం కేవలం మోదీతో మొదలవలే దని, నాటి రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీలిద్ద రూ ఫాసిస్టు పోకడల్లో మోదీకి పూర్వీకులని వరవరరావు అన్నారు.

జరుగుతున్నవన్నీ భూపోరాటాలే..
న్యూ డెమొక్రసీ జాతీయ నాయకురాలు టాన్యా మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పోరాటాలన్నీ భూపోరాటాలేనని అన్నారు. సింగూరు, నందిగ్రాం, మొదలుకొని, సోం పేట, కాకరాపల్లి, నేడు ఆంధ్రప్రదేశ్‌లో బల వంతపు భూసేకరణకి వ్యతిరేకంగా జరుగు తున్న ఉద్యమాలన్నింటికీ భూమే కేంద్రమని అన్నారు. ప్రజల భూపోరాటాలను బలోపే తం చేయాలన్నారు. సాదినేని వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తమిళనాడు సీఎస్‌ఎఫ్‌ నాయకులు బాలన్, మహారాష్ట్ర మార్క్స్‌స్ట్‌లెనినిస్ట్‌ పార్టీ నాయ కుడు అశోక్, తమిళనాడు సీపీఐ ఎంఎల్‌ నాయకులు భాస్కర్, గుర్రం విజయ్‌ కుమార్, వేములపల్లి వెంకట్రామయ్య తది తరులు ఉపన్యసించారు. టాన్యా రచించిన ‘భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’ పుస్తకాన్ని వరవరరావు.. ఎన్‌.విజయశేఖర్‌ రచించిన ‘మహత్తర అక్టోబర్‌ రష్యా విప్లవం’ పుస్తకాన్ని టాన్యా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement