స్మరిస్తూ.. విస్మరిస్తూ | Unproduced monumental building | Sakshi
Sakshi News home page

స్మరిస్తూ.. విస్మరిస్తూ

Jul 4 2015 12:53 AM | Updated on Aug 15 2018 9:27 PM

స్మరిస్తూ.. విస్మరిస్తూ - Sakshi

స్మరిస్తూ.. విస్మరిస్తూ

విముక్తి పోరాటంలో విప్లవజ్వాలై రగిలి.. నిజాం నిరంకుశంపై అంకుశమై నిలిచి..

ఏడేళ్లుగా నిర్మాణానికి నోచుకోని స్మారక భవనం
టీఆర్‌ఎస్ సర్కారుకు పట్టని వైనం
నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి

 
విముక్తి పోరాటంలో విప్లవజ్వాలై రగిలి.. నిజాం నిరంకుశంపై అంకుశమై నిలిచి.. అమరత్వంతో అగ్నిశిఖలను పంచి.. సాయుధ పోరును పదునెక్కించిన ధీరుడు.. దొడ్డి కొమురయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి వేగు చుక్క. తాను అమరుడైనా.. ఆ స్ఫూర్తితో ఉద్యమ ఫలితాన్ని నిర్దేశించిన యోధుడు. పోరాటాల పుట్టినిల్లు కడివెండి ముద్దుబిడ్డ కొమురయ్య అమరత్వానికి నేటితో 69 ఏళ్లు.  
 
 కడవెండి(దేవరుప్పుల) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. ఆయన స్ఫూర్తిని సభల్లో ప్రస్తావించడం.. ఆచరణలో విస్మరించడం పాలకులకు అలవాటుగా మారింది. నేటికీ ఆయన స్మారక భవనాన్ని నిర్మించకపోవడం దీని కొనసాగింపే.  

అమరత్వం ఇలా..
పాలకుర్తి మండలం విస్నూరులో రామచంద్రారెడ్డి, కడవెండిలో అతడి తల్లి జానమ్మ దొరసాని దౌర్జన్యాలను ఎదురించేందుకు గుప్తల సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో 1928లో దొడ్డి గట్టమ్మ- కొండయ్య కుమారుడు కొమురయ్య చేరారు. తన పదహారో ఏటనే కొమురయ్య వివాహం చేసుకున్నాడు. అన్న మల్లయ్య ప్రభావంతో సంఘ సభ్యుడిగా కీలకపాత్ర పోషించాడు. 1946 జూలై 4న కడివెండి లో నిరసన ప్రదర్శన చేస్తున్న సంఘ సభ్యులపై ప్రస్తుత బొడ్రాయి వద్ద విస్నూరు దేశ్‌ముఖ్ గూండాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అన్న మల్లయ్యతోపాటు పలువురు గాయపడగా దొడ్డి కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటి నుంచే సాయుధ పోరాటం ఎరుపెక్కింది. దొడ్డి కొమురయ్య అమరత్వం స్ఫూర్తితో నాలుగు వేల మంది ప్రాణాలు త్యాగం చేసి నైజాం సర్కారు నీడ నుంచి అనేక గ్రామాలను విముక్తి చేశారు. తర్వాత నూతన ప్రజాస్వామిక విప్లవం పేరిట వివిధ పంథాలో సాగుతున్న సాయుధ పోరాటంలోనూ ఈ గ్రామస్తులదే ప్రధాన భూమిక.

 శిలాఫలకానికే స్మారక భవనం పరిమితం
 కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారకార్థం నిర్మించాల్సిన భవనం శిలాఫలకానికే పరిమితమైంది. సీపీఐ భారీ స్మారక స్థూపం నిర్మిం చిం ది. 2007 జూలై 4 న వామపక్షాలు ఇతర విప్లవ గ్రూపుల సాయంతో 700 గజాల స్థలాన్ని సేకరించి స్మారక భవన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంతో శంకుస్థాపన చేరుుంచారు. కానీ నిర్మాణానికి నోచుకోవడం లేదు.
 
పాలకులు స్పందించరేమి?
 తెలంగాణ మలివిడత ఉద్యమంలో కొమురయ్యను పదేపదే తలుచుకున్న టీఆర్‌ఎస్ నేతలకు ఉద్యమాల గడ్డపై కొమురయ్య స్మృతి చిహ్నం నిర్మించే తీరిక లేకుండా పోరుుం దనే విమర్శ విన్పిస్తోంది. ఇటీవల సీపీఐ రాష్ర్టశాఖ ఇదే భవన నిర్మాణానికి నిధుల కోస సీఎం కేసీఆర్ వద్దకెళ్తే స్పందించలేదనే ఆరోపణ ఉంది.  నేడు నిర్వహించే దొడ్డి కొమురయ్య వర్ధంతి సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ కార్యదర్శి ముద్దం శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement