తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకు చేపట్టే కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకు చేపట్టే కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ జరిగిన ఐక్యవేదిక కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఈ సమావేశం పూర్తి మద్దతు తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరహాలో ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఏ రాజకీయ పార్టీలో చేరని వారితో చెరుకు సుధాకర్ కన్వీనర్‌గా ఐక్య వేదిక ఏర్పడిన విషయం తెలిసిందే.


