'పులిచింతల'ను సందర్శించిన ఉగాండా బృందం | udanda team visits pulichithala project | Sakshi
Sakshi News home page

'పులిచింతల'ను సందర్శించిన ఉగాండా బృందం

May 16 2015 1:31 PM | Updated on Sep 3 2017 2:10 AM

'పులిచింతల'ను సందర్శించిన ఉగాండా బృందం

'పులిచింతల'ను సందర్శించిన ఉగాండా బృందం

నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలో కృష్ణా నదిపై ఏర్పాటైన పులిచింతల బహుళార్థక సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులను ఉగాండా అధికారుల బృందం శనివారం సందర్శించింది.

మేళ్లచెర్వు: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలో కృష్ణా నదిపై ఏర్పాటైన పులిచింతల బహుళార్థక సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులను ఉగాండా అధికారుల బృందం శనివారం సందర్శించింది. తమ దేశంలో మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా ఉగాండా ప్రభుత్వం... భారత్‌లో మౌలిక సదుపాయాలపై అధ్యయనం కోసం ఆరుగురు అధికారులను పంపింది. వీరు హైదరాబాద్‌లోని మెట్రోరైలు ప్రాజెక్టును కూడా సందర్శించారు. శనివారం పులిచింతలను సందర్శించి ప్రాజెక్టు విశేషాలను, వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కృష్ణా జిల్లా జేసీ సత్యనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement