రెండు కేజీల ‘సీహెచ్’ పట్టివేత | Two kg 'ch' Capture | Sakshi
Sakshi News home page

రెండు కేజీల ‘సీహెచ్’ పట్టివేత

Dec 16 2015 1:50 AM | Updated on Mar 28 2018 11:26 AM

రెండు కేజీల ‘సీహెచ్’ పట్టివేత - Sakshi

రెండు కేజీల ‘సీహెచ్’ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల క్లోరల్ హైడ్రేట్(సీహెచ్)ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

-  ఇద్దరి అరెస్టు, రిమాండు
 షాబాద్ :
అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల క్లోరల్ హైడ్రేట్(సీహెచ్)ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చేవెళ్ల ఎక్సైజ్ సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాచన్‌పల్లికి చెందిన కలాల్ ఆంజనేయులుగౌడ్, మహేందర్‌గౌడ్‌లు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నాగరగూడ నుంచి బైకుపై చేవెళ్ల వైపు వెళ్తున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ పోలీసులు వారిని పట్టుకున్నారు. తనిఖీ చేసి రెండు కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు. తనిఖీల్లో ఎస్‌ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది సత్తార్, వెంకటేష్, అమీన్, యూసుఫ్, కవిత ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement